తేజేశ్వర్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుల బైండోవర్
గద్వాల, 17 అక్టోబర్ (హి.స.) రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బెయిల్ పై ఇటీవల విడుదలైన నిందితులు ఏ-1 తిరుమలరావు, ఏ-7 తిరుపతయ్యలను గురువారం గద్వాల సర్కిల్ ఇన్స
తేజేశ్వర్ హత్య కేసు


గద్వాల, 17 అక్టోబర్ (హి.స.)

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బెయిల్ పై ఇటీవల విడుదలైన నిందితులు ఏ-1 తిరుమలరావు, ఏ-7 తిరుపతయ్యలను గురువారం గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శ్రీనివాస్ గద్వాల తహసీల్దార్ మల్లికార్జున్ ఎదుట హాజరుపరిచారు.

కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. నిందితులు మళ్లీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేందుకు చట్టపరమైన ప్రక్రియలో భాగంగా వారిని బైండోవర్ చేసినట్లు సీఐ టీ. శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులోని నిందితులందరూ షరతులతో కూడిన బెయిల్పై ఉన్నారని ఆయన వివరించారు. తేజేశ్వర్ హత్య కేసు విచారణలో పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించడం, కోర్టు ప్రక్రియ కొనసాగుతుండటంతో, ఈ కేసు మరింత ఆసక్తికర మలుపు తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande