గుజరాత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. డిప్యూటీ CMగా హర్ష్ సంఘ్వీ ప్రమాణం
గుజరాత్, 17 అక్టోబర్ (హి.స.) గుజరాత్లో ఇవాళ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ మేరకు సూరత్ ఎమ్మెల్యే హర్ష్ సంఘ్వీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీ
గుజరాత్ క్యాబినెట్


గుజరాత్, 17 అక్టోబర్ (హి.స.)

గుజరాత్లో ఇవాళ ముఖ్యమంత్రి

భూపేంద్ర పటేల్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ మేరకు సూరత్ ఎమ్మెల్యే హర్ష్ సంఘ్వీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్ లోని మహాత్మా మందిర్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ఆచార్య దేవవ్రత్ హాజరై హర్ష్ సంఘ్వీతో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం కేబినెట్ సభ్యుల సంఖ్య ముఖ్యమంత్రితో కలిపి 25కు చేరింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో గురువారం సీఎం భూపేంద్ర పటేల్ మినహా కేబినెట్లో ఇప్పటి వరకు 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కుల, ప్రాంతీయ సమతుల్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మంత్రివర్గంలో 8 మంది ఓబీసీలు, 3 మంది ఎస్సీలు, నలుగురు ఎస్టీలు, ఏడుగురు పటేళ్లకు అవకాశం కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande