తిరుమల పరకామణి చోరీ కేసుపై.ఈ.రోజు.హై.కోర్టు లో విచారణ
అమరావతి, 17 అక్టోబర్ (హి.స.) అమరావతి, అక్టోబర్17: తిరుమల పరకామణిలో చోరీ కేసుపై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో ) విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు సహా ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ
తిరుమల పరకామణి చోరీ కేసుపై.ఈ.రోజు.హై.కోర్టు లో విచారణ


అమరావతి, 17 అక్టోబర్ (హి.స.)

అమరావతి, అక్టోబర్17: తిరుమల పరకామణిలో చోరీ కేసుపై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో ) విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు సహా ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో 20 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తిరుమల పరకామణిలో చోరీ ఘటనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును టీటీడీ కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయమిస్తూ ఈనెల 27కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande