హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)
గోషామహల్ నియోజకవర్గం
కుల్సుంపురాలో కబ్జాలను హైడ్రా అధికారులు తొలగించి 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం గోషామహల్ నియోజకవర్గంలోని కులుసుంపురాలో కబ్జాలో ఉన్న వాటిని తొలగించి 1.30 ఎకరాల భూమిని కాపాడారు. తన భూమిగా అంటున్న అశోక్ సింగ్ హైడ్రా అధికారులపై దాడులకు పాల్పడ్డాడు. గత 4 తరాలుగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ అశోక్ సింగ్ ఈ ల్యాండ్లో కబ్జాలో ఉన్నట్లు, ప్రభుత్వానికి అనుకూలంగా సిటీ సివిల్ కోర్టు తీర్పు చెప్పింది. అయితే అశోక్ సింగ్ అతని బ్రదర్స్ అయినా ఆ స్థలం ఖాళీ చేయకుండా.. అద్దెలు అనుభవిస్తున్నాడు. అశోక్ సింగ్పై వివిధ పోలీసు స్టేషన్లలో భూ కబ్జాదారుడుగా, రౌడీ షీటర్గా పలు కేసులు ఉన్నాయి. ప్రజావసరాలకు ఈ భూమిని వినియోగించాలని భావించిన ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రూ.110 కోట్ల విలువైన ఈ భూమిని ఇప్పటికే రెండు సార్లు రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..