ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడి గా ఉన్న ఐపీఎస్ అధికారి.సంజయ్ రిమాండ్.పొడిగింపు
అమరావతి, 17 అక్టోబర్ (హి.స.) విజయవాడ: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్‌ అధికారి సంజయ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. ఈ నెల 31 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపట్లో అతడిని విజయ
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడి గా ఉన్న ఐపీఎస్ అధికారి.సంజయ్ రిమాండ్.పొడిగింపు


అమరావతి, 17 అక్టోబర్ (హి.స.)

విజయవాడ: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్‌ అధికారి సంజయ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. ఈ నెల 31 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపట్లో అతడిని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. సంజయ్‌ అగ్నిమాపకశాఖ డీజీ, సీఐడీ ఏడీజీగా పనిచేసినప్పుడు రూ.1.5 కోట్ల మేర ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని విజిలెన్స్‌ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. (Andhra Pradesh News)

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande