మహబూబ్నగర్, 17 అక్టోబర్ (హి.స.)
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై
కాంగ్రెస్ సర్కార్ బీసీలను, ప్రజలకు దగా చేస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపణలు చేశారు. ఇవాళ ఆమె మహబూబ్నగర్లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి అసలు చిత్తశుద్ధే లేదని అన్నారు. అసలు ప్రభుత్వ విధానమే సరిగ్గా లేదని.. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో కోర్టులో నిలబడదని తాను అప్పుడే చెప్పానని కామెంట్ చేశారు. బీసీలను, ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని ఫైర్ అయ్యారు.
బీసీ రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరూ ఊహించినదేనని అన్నారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ డ్రామాలకు తెర లేపారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని కామెంట్ చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు తాము ఆమోదం తెలిపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కానీ, నేడు కాంగ్రెస్ నేతలు బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డు పడుతోందని మీడియా మందుకు రావడం హాస్యాస్పదమని డీకే అరుణ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు