జయశంకర్ భూపాలపల్లి, 17 అక్టోబర్ (హి.స.)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని
టేకుమట్ల మండల కేంద్రంలో గ్రామ
పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలకు జీవీకే ఈఎంఆర్ఐ 108 అంబులెన్స్ ఆధ్వర్యంలో సీపీఆర్ పై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గుండెపోటు వచ్చినప్పుడు తక్షణ సహాయం అందించడానికి సిపిఆర్ విధానం ఎలా చేయాలి. దాని ప్రాముఖ్యత గురించి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ హరిప్రసాద్ స్వయంగా సిపిఆర్ చేసి చూపించారు.
అనంతరం మాట్లాడుతూ.. సి పి ఆర్ అనేది ఒక అత్యవసర ప్రాణ రక్షణ పద్ధతి అని ఎవరైనా శ్వాస తీసుకోవడం గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు ఇతర ముఖ్య అవయవాలకు రక్తాన్ని ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. సిపిఆర్ లో ప్రధానంగా చాతిని గట్టిగా వేగంగా నొక్కడం గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణమే అందించాల్సిన అత్యవసర చికిత్స అని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం సిపిఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన ప్రజలు కలిగి ఉండాలని తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు