మాజీ ఎమ్మెల్యే రసమయి ఫామ్ హౌస్ ముట్టడి
కరీంనగర్, 17 అక్టోబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. దీనితో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ తరుణంలో గన్నేరువరం మండల కేంద్రంలో రసమయి బా
ఫామ్ హౌస్ ముట్టడి


కరీంనగర్, 17 అక్టోబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా మానకొండూరు

ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ

పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. దీనితో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ తరుణంలో గన్నేరువరం మండల కేంద్రంలో రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు బెజ్జంకి మండలం గుండారం గ్రామంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫామ్ హౌస్ ను ముట్టడించారు. పోలీసులు ఫామ్ హౌస్ వద్దకు చేరుకొని కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande