సంగారెడ్డి, 17 అక్టోబర్ (హి.స.)
ఇంట్లో మనవరాలి పెళ్లి కోసమని
బంగారం కొనేందుకు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లారు. అక్కడ బంగారాన్ని కొని తిరిగి సంగారెడ్డికి బస్సులో ప్రయాణమయ్యారు. బస్సు దిగే క్రమంలో హడావుడిగా బంగారం దాచి ఉంచిన పర్సు బస్సులో పడిపోయింది. అది గమనించిన తోటి ప్రయాణికుడు, ఆర్టీసీ కండక్టర్ తమ నిండు మనసుతో నిజాయితీని చాటుకుని వెంటనే ఆర్టీసీ అధికారులకు విషయాన్ని తెలిపి ఆ మొత్తం బంగారాన్ని వారికి తిరిగి అప్పగించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. సంగారెడ్డి పట్టణానికి చెందిన బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి ప్రకాష్ అతని భార్య వసుధ తమ మనవరాలి పెళ్లి కోసమని బంగారం కొనేందుకు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ 39 తులాల బంగారాన్ని కొని తిరిగి సంగారెడ్డి డిపోకు చెందిన నారాయణఖేడ్ బస్సులో ఎక్కారు.
ఆ పర్సు లో 49.29 లక్షల విలువ గల 39 తులాల బిస్కెట్ బంగారం ఉందని డిపో మేనేజర్ తెలిపారు. నిజాయితీ చాటుకున్న తోటి ప్రయాణికుడు మరియు కండక్టర్ ను
పలువురు అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు