ఆసిఫాబాద్ జిల్లాలో భారీ కొండచిలువ కలకలం
ఆసిఫాబాద్, 17 అక్టోబర్ (హి.స.) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మండలం కొత్త సార్సాల సమీపంలో గురువారం రాత్రి రోడ్డుపై భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. పనులు పూర్తిచేసుకుని ఇళ్లకు వెళ్తున్న ప్రజలకు రోడ్డు దాటుతూ కొండచిలువ కనిపించడంతో ఒక
కొండచిలువ


ఆసిఫాబాద్, 17 అక్టోబర్ (హి.స.) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని

కాగజ్నగర్ మండలం కొత్త సార్సాల

సమీపంలో గురువారం రాత్రి రోడ్డుపై భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. పనులు పూర్తిచేసుకుని ఇళ్లకు వెళ్తున్న ప్రజలకు రోడ్డు దాటుతూ కొండచిలువ కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్లో ఇప్పటికే ఒకవైపు పెద్దపులి భయభ్రాంతులకు గురి చేస్తుండగా మరోవైపు గత కొన్ని రోజులుగా గ్రామాల్లో కొండచిలువలు కనిపించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande