బీసీల శ్రేయస్సు కోసం మా పోరాటం ఆగదు- సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి,17 అక్టోబర్ (హి.స.) బీసీల శ్రేయస్సు కోసం తమ పోరాటం ఆగదని, ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న బీసీ బంద్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ బంద్కు బీఆర్ఎస్ పార
సంగారెడ్డి ఎమ్మెల్యే


సంగారెడ్డి,17 అక్టోబర్ (హి.స.)

బీసీల శ్రేయస్సు కోసం తమ పోరాటం

ఆగదని, ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న బీసీ బంద్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ బంద్కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించిందనీ, జిల్లా ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్రవ్యాప్త బంద్ ఒక శాంతియుత నిరసన రూపమన్నారు. బీసీల శ్రేయస్సు కోసం పోరాటం కొనసాగుతుందని, సమాజ అభివృద్ధి కోసం ఇది ఒక ఆవశ్యక దశ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, సంఘాలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని బీసీ సమాజ ఐక్యతను చాటాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ మద్దతు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande