వేములవాడ మీసేవ, 17 అక్టోబర్ (హి.స.)
భక్తుల విశ్వాసానికి ప్రతీక రాజన్న
కోడె మొక్కు చెల్లింపు అని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.
శుక్రవారం వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు ఉచిత కోడెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్ హాజరై రైతులకు కోడెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా రాజన్న ఆలయంలో స్వామి వారికి కోడెను కట్టే సంస్కృతి ఉందని పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు ఉచిత కోడెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు నేరుగా కోడెలను పంపిణీ చేయడం వలన వాటిని వ్యవసాయనికి ఉపయోగిస్తున్నారనీ,
రైతులు కోడెలను చక్కగా చూసుకుంటూ సంరక్షించే బాధ్యత తీసుకోవాలనీ సూచించారు. రైతులకు పంపిణీ చేసిన కోడెలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, కోడెలను ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..