పంచాయతీ వ్యవస్థలో మార్పులు.. ప్రతి పంచాయతీకి అభివృద్ధి అధికారి
పాలకొల్లు, 17 అక్టోబర్ (హి.స.)ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ వ్యవస్థలో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరగబోతున్న మార్పుల్లో భాగంగా ఇకపై ప్రతి పంచాయతీకి పంచాయతీ అభివృద్ధి అధికారులు రాబోతున్నారని పశ్చిమగోదావరి జిల్లా పా
a-development-officer-will-now-be-appointed-for-every-panchayat-


పాలకొల్లు, 17 అక్టోబర్ (హి.స.)ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ వ్యవస్థలో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరగబోతున్న మార్పుల్లో భాగంగా ఇకపై ప్రతి పంచాయతీకి పంచాయతీ అభివృద్ధి అధికారులు రాబోతున్నారని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎంపీడీవో ఎన్ ఎన్ ఉమామహేశ్వరరావు తెలిపారు.

ఆయన దిశ ప్రతి నిధితో పాలకొల్లులోని ఎంపీడీఓ కార్యాలయం లోని ఆయన ఛాంబర్‌లో మాట్లాడారు. గతంలో గ్రామ కార్యదర్శులు అనే వారిని ఆ పేరును మార్పు చేసి పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్పు చేస్తారని తెలిపారు. గతంలో ఐదు గ్రేడ్లుగా ఉండేవని ఇప్పుడు మూడు గ్రేడ్లకు కుదించడం జరుగుతుందని తెలిపారు. గ్రేడ్ వన్ పంచాయతీలలో ప్రస్తుతం గ్రేడ్ వన్ పంచాయతీలలో గ్రామ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న సీనియర్లకు జనాభా పదివేలు దాటిన గ్రామపంచాయతీలో డిప్యూటీ ఎంపీడీవో ప్రమోషన్లు రాబోతున్నాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande