ఖమ్మం, 17 అక్టోబర్ (హి.స.)
గంజాయి పీలుస్తూ ఆరుగురు
యువకులు పట్టుబడిన సంఘటన సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామం శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సత్తుపల్లి పట్టణ సీఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో పలు గంజాయి కేసుల్లో ఉన్న సింహాద్రి, రంజిత్ తమ స్నేహితులైన మధిరకు చెందిన సూర్యదేవర రాజేష్, ఏలూరుకు చెందిన అశోక్తో కలిసి ఒరిస్సాలోని మధు వద్ద గంజాయి కొనుగోలు చేసి సత్తుపల్లికి తరలించి రాజేష్, అశోక్, సింహాద్రి వద్ద ఉన్న గంజాయిని సింగపోగు శ్రీనాథ్, రాయల పవన్, కారుమంచి రంజిత్, కారుమంచి రక్షక, మారెళ్ళ స్వామి, బాచి లకు అమ్మినారు.
ఈ క్రమంలో అందరూ కలిసి సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామ స్మశాన వాటిక డంపింగ్ యార్డ్ సమీపంలో గంజాయి పిలుస్తున్నారని పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సత్తుపల్లి పోలీసులు దాడులు నిర్వహించగా ఆరుగురు యువకులు పట్టుబడగా వారి వద్ద నుంచి 320 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఈ కేసుతో సంబంధం ఉన్న పదిమంది పై కేసు నమోదు చేసి ఆరుగురును అరెస్టు చేసి సత్తుపల్లి కోర్టులో హాజరు పరచి రిమాండ్కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు