మోడీ దీపావళి టపాకాయ తుస్సుమంది.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
అమరావతి, 17 అక్టోబర్ (హి.స.)ప్రధాని మోడీపై ఎక్స్ వేధికగా వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు వేదికగా మోడీ దీపావళి టపాకాయ తుస్సుమంది అంటూ విమర్శలు గుప్పించారు. వచ్చిందేమో ఏపీకి కానీ బీహార్ ఎన్నికల కోసం కాషాయ వేషం వేశారంటూ షర్మిల ఎద్దేవా చేశ
షర్మిల


అమరావతి, 17 అక్టోబర్ (హి.స.)ప్రధాని మోడీపై ఎక్స్ వేధికగా వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు వేదికగా మోడీ దీపావళి టపాకాయ తుస్సుమంది అంటూ విమర్శలు గుప్పించారు. వచ్చిందేమో ఏపీకి కానీ బీహార్ ఎన్నికల కోసం కాషాయ వేషం వేశారంటూ షర్మిల ఎద్దేవా చేశారు. శ్రీశైలం మల్లన్న సాక్షిగా నీచ రాజకీయాలకు మోడీ తెరలేపి మరోసారి రాష్ట్ర ప్రజలను ఘరానా మోసం చేశారని మండిపడ్డారు. మెడీకి చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం మల్లన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్ర‌శ్నించారు. రూ.1657 కోట్ల‌తో పెండింగ్ మాస్ట‌ర్ ప్లాన్ మీకు క‌న‌బ‌డ‌లేదా అని అన్నారు.

ఉజ్జ‌యిని, వార‌ణాసి, గంగాన‌ది కారిడార్ల అభివృద్ధిపై చూపి ప్రేమ మ‌ల్ల‌న్న కారిడార్ పై ఎందుకు లేద‌ని ప్ర‌శ్నించారు. శ్రీశైలం క్షేత్ర కారిడార్ నిర్మాణ ప‌నుల‌కు కేంద్రం నుండి అనుమ‌తి ఇవ్వ‌డానికి మ‌నసు ఎందుకు రాలేద‌ని అడిగారు. ఇది మీరు మ‌ల్ల‌న్న‌కు చేస్తున్నా ద్రోహం కాదా అంటూ ప్ర‌శ్నించారు. 11 ఏళ్ల క్రితం తిరుపతి వేదికగా చెప్పిన పిట్టకథే మళ్ళీ చెప్పారని, ఢిల్లీకి - రాష్ట్ర రాజధానికి లింక్ పెట్టారన్నారు. అరకొర అప్పులు ఇస్తే ఢిల్లీతో అమరావతి పోటీ పడుతుందా ? అని అడిగారు. అప్పులకు హామీలు ఇచ్చినంత మాత్రాన ప్రగతిలో పరుగులు పెడుతుందా ? అని ప్ర‌శ్నించారు. రాజధానికి లక్ష కోట్ల అప్పులు తెస్తే రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారుతుందని నిల‌దీశారు. ప్రగతి ద్వారాలు ఎలా తెరుచుకుంటాయని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande