అమరావతి, 18 అక్టోబర్ (హి.స.)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ) ఆదేశాలతో ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం ఈరోజు (శనివారం) సమావేశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్ధాయిలో తొలిసారి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొబ్బరాజు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ