వైకల్య ధ్రువీకరణకు కొత్త రూల్స్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) వైకల్య ధ్రువీకరణ (Disability Verification)కు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. గతంలో దేశవ్యాప్తంగా ఉన్న వికలాంగుల ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడం, దానిని మరింత పారదర్శకంగా మార్చడం లక్ష్యంగా భారత ప్రభుత్
న్యూ రూల్స్


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

వైకల్య ధ్రువీకరణ (Disability

Verification)కు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. గతంలో దేశవ్యాప్తంగా ఉన్న వికలాంగుల ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడం, దానిని మరింత పారదర్శకంగా మార్చడం లక్ష్యంగా భారత ప్రభుత్వం వైకల్య ధృవీకరణ కోసం ఈ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. నవీకరించబడిన నియమాలు వైద్య అంచనా, డాక్యుమెంటేషన్ అవసరాలు, వైకల్య ధ్రువీకరణ పత్రాల (Disability certificates)ను జారీ చేసే విధానాన్ని కవర్ చేస్తాయి. ఈ మార్పులు వైకల్యాలున్న వ్యక్తులకు సకాలంలో ప్రయోజనాలను పొందేలా చూసుకోవడానికి, అధికారిక అడ్డంకులను తగ్గించడానికి ఉద్దేశించినవి అని అధికారులు పేర్కొన్నారు. రాబోయే నెలల్లో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త నియమాలు అమలు చేయబడతాయని భావిస్తున్నారు.

కాగా తాజాగా కేంద్రం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ను(Standard Operating Procedure) ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అభ్యర్థులు సమర్పించే సర్టిఫికేట్స్ పరిశీలనలో ఈ రూల్స్ పాటించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి సర్టిఫికేట్ ను, యూనిక్ డిజాబిలిటీ ఐడి కార్డ్ (Unique Disability ID Card)ను జాతీయ పోర్టల్ లో చెక్ చేయాలని కేంద్ర ఆదేశించింది. అలాగే అప్లికేషన్ ప్రోగ్రామింగ్, ఇంటర్ ఫేస్ తో ఆయా సంస్థలు అనుసంధానం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త రూల్స్ లో ప్రస్తావించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande