హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)
నిజామాబాద్ సీసీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ హత్యకు గురైన ఘటపై డీజీపీ శివధర్రెడ్డి సీరియస్ అయ్యారు. సిన్సియర్గా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వాహనాల దొంగతనాలను, చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న షేక్ రియాద్ ఆచూకీ సమాచారం లభించిన వెంటనే అతడిని పట్టుకుని పోలీస్టేషన్కు తీసుకొస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ను నిందితుడు కత్తితో పొడిచి పరారయ్యాడు. అయితే, హత్య చేసిన షేక్ రియాద్ను వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డిని ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, వారికి అవసరమైన సాయం చేయాలన్నారు. హత్య జరిగిన స్పాట్లో లభించిన ఆధారాలను బట్టి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు