ఫలించిన హైదరాబాద్ డాక్టర్ 8 ఏళ్ల పోరాటం.. ఆ పానీయాలకు ‘ORS’ లేబుల్ నిషేధం..
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలి 8 ఏళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలపై ఏళ్లుగా పోరాడింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి ఆరోగ్యం దెబ్బతీసే విధంగా లేబుల్స్ ఉన్నాయని వాట
ఫలించిన హైదరాబాద్ డాక్టర్ 8 ఏళ్ల పోరాటం.. ఆ పానీయాలకు ‘ORS’ లేబుల్ నిషేధం..


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలి 8 ఏళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలపై ఏళ్లుగా పోరాడింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి ఆరోగ్యం దెబ్బతీసే విధంగా లేబుల్స్ ఉన్నాయని వాటిని నిషేధించాలని ఆమె పట్టుబట్టింది.

హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్‌ శివరంజని. ఆమె ప్రస్తుతం ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న బ్రాండ్లు అన్ని నిజమైన ఓఆర్ఎస్‌లు కావని ఆమె ఏళ్ల తరబడి చెబుతూ పోరాటం చేశారు. సాధారణంగా, అతిసారం (డయేరియా)తో బాధపడుతున్నప్పుడు శరీరంలో సోడియం, షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఉండేందుకు ‘ఓఆర్ఎస్’ తాగాలని వైద్యులు సూచిస్తారు. డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం.. సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాషియం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ డైహైడ్రేట్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉన్న పానీయం అసలైన ఓఆర్ఎస్‌. ఇందులో గ్లూకోజ్ స్థాయి కీలకం

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సాల్ట్స్‌) పదాన్ని ఉపయోగించవద్దని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ(FSSI) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కూల్‌డ్రింక్స్‌ రూపంలో ఉన్న టెట్రాప్యాక్‌లపై ఓఆర్‌ఎస్, ఓఆర్‌ఎస్‌ఎల్‌ అనే పదాలను ముద్రించకూడదని హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande