అమరావతి, 18 అక్టోబర్ (హి.స.)
తిరుమల, అక్టోబర్ 18: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆ శ్రీనివాసుడిని కనులారా వీక్షించి పునీతులవుతుంటారు భక్తులు. ఏడాదిలో ఒక్కసారన్నా తిరుమలకు రావాలని తపించిపోతుంటారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల కొందరు మోసపూరితంగా వ్యవహరిస్తుంటారు. శ్రీవారి దర్శనం టికెట్లు ఇస్తామని.. దగ్గరుండి శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తామంటూ భక్తులను నమ్మబలుకుతారు. వీరి మాయమాటలు నమ్మిన కొందరు భక్తులు త్వరగా శ్రీవారి దర్శనం అవుతుందని భావించి వారికి డబ్బులు ఇస్తుంటారు. తీరా తిరుమలకు వెళ్లాక సదరు వ్యక్తి మోహం చాటేయడంతో తాము మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమంటుంటారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే తిరుమలలో చోటు చేసుకుంది. శ్రీవారి సేవా టికెట్ల పేరుతో మోసానికి పాల్పడ్డాడు దళారి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ