బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి: కవిత
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) బీసీ బంద్కు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైరతాబాద్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాగృతి నాయకులు, కార్యకర్తలతో కలిసి కవిత ఆటోలో వచ్చారు. ఖైరతాబాద్ చౌరస్తాలో నాయకులతో కలిసి భైటాయించారు. ఈ సంద
జాగృతి కవిత


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

బీసీ బంద్కు మద్దతుగా తెలంగాణ

జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైరతాబాద్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాగృతి నాయకులు, కార్యకర్తలతో కలిసి కవిత ఆటోలో వచ్చారు. ఖైరతాబాద్ చౌరస్తాలో నాయకులతో కలిసి భైటాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ వ్యాప్తంగా తమకు 42శాతం రిజ్వేషన్లు కావాలని బీసీ బిడ్డలు నేడు నిరసన తెలుపుతున్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు కూడా వచ్చి ఈ రోజు బంద్ లో పాల్గొనడం హంతకుడే నివాళులు అర్పించినట్టు ఉందన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మోసం చేస్తూనే ఉన్నాయని అన్నారు. తెలంగాణలో మొదలైన బీసీ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు లాభం చేకూరేలా చేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందో అలానే మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతామని చెప్పారు. బంద్కు ప్రజాస్వామ్యవాదులు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని చెప్పారు. ఎన్నికలు ఇంకా ఐదు నెలల వరకు అవ్వకపోయినా నష్టం లేదని అన్నారు. తమిళనాడులో పదేళ్లు ఎన్నికలు జరగలేదని అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande