బీసీ రిజర్వేషన్లపై మాకు ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీసీ బంద్కు మద్దతుగా అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ బంద్ మంత్రుల
మహేష్ కుమార్ గౌడ్


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీసీ బంద్కు మద్దతుగా అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ బంద్ మంత్రులు అందరూ పాల్గొంటున్నారని తెలిపారు. ఉదయం నుంచి అందరితో తాను మానిటరింగ్ చేస్తున్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని తెలిపారు. తాము అడుగుతున్న కోరిక న్యాయమైనది కాబట్టే ప్రజలకు కూడా బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు.

బీసీ రిజర్వేషన్ల విషయంలో తమకు ఉన్నంత చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదన్నారు. రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో ఇచ్చాయని అన్నారు. దురదృష్టవశాత్తు ఆ జీవోపై స్టే విధించిందని గుర్తు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande