బీసీ రిజర్వేషన్లపై బిజెపి ద్వంద వైఖరి.. కొండా సురేఖ
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీసీ జేఏసీ చేపట్టిన బంద్కు అన్ని రాజకీయ పార్టీతో పాటు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్
కొండ సురేఖ


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీసీ జేఏసీ చేపట్టిన బంద్కు అన్ని రాజకీయ పార్టీతో పాటు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ కొనసాగింది. మంత్రి కొండా సురేఖ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తో కలిసి రేత్ఫైల్ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజీపీ కిరికిరి వల్లే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు ఆగిపోయిందని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్రెడ్డి చిత్తశుద్ధితో పని చేశారని పేర్కొన్నారు. చట్ట సభల్లో బిల్లు పెట్టి అమోదించామని, ఆర్డినెన్స్ జారీ చేశామని తెలిపారు. కానీ, గవర్నర్ ఒక్క సంతకం పెట్టి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదని అన్నారు. కానీ, బిల్లును ఆపాలనే కుట్రతోనే కేంద్రానికి పంపారని కామెంట్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన జీవోకు అడ్డుపడ్డారని ఆరోపించారు. మళ్లీ బీసీ బంద్ లో బీజేపీ పాల్గొని డ్రామలు ఆడుతోందని మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande