న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.. బీసీ రిజర్వేషన్లపై మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తామని, హైకోర్టు లో త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి బీసీ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మంత్రి పొన్నం ప్రభాకర్


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై

న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తామని, హైకోర్టు లో త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి బీసీ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించి బీసి రిజర్వేషన్ బిల్లు (BC Reservation Bill)ను చట్టసభల్లో ఆమోదించామని అన్నారు. అనంతరం ఆ బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లిందన్నారు. మార్చి 30 నుంచి గవర్నర్ దగ్గరకు వెళ్లిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులు రాక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.

రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతోనే బీసీ బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇక న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తామని.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని అన్నారు. బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి మాదిగ దండోరా, మాల మహానాడు మద్దతుతో బంద్కు పిలుపునివ్వడం ప్రశంసనీయమని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande