ఖమ్మం, 18 అక్టోబర్ (హి.స.)
భారతదేశం సర్వమత సమ్మేళనం.
అలాంటి భారతదేశంలో రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలంటే రాజ్యాంగ సవరణతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో ఆనాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి టూ కాశ్మీర్ వరకు పాదయాత్రలో హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కుల గణన నిర్వహించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వారు నేడు మాట్లాడుతూ.. అన్ని కులాలు అన్ని మతాలకు న్యాయం జరిగేలా న్యాయబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులతో తెలంగాణలో ఇంటింటా సర్వే నిర్వహించి బీసీ సర్వే ఆధారంగా 56% జనాభా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో క్యాబినెట్ ఆమోదం పొంది గవర్నర్, రాష్ట్రపతి ఆమోదాలకు పంపితే రాజ్యాంగబద్ధంగా గవర్నర్ వ్యవహరించాల్సిన రాష్ట్రపతి అధికార పార్టీకి మద్దతుగా నిలిచి 42 శాతం రిజర్వేషన్ బీసీ బిల్లును పెండింగ్లో పెట్టి కాలయాపన చేయడం తగదని మంత్రి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు