ప్రజారోగ్య దృశ్య వెంటనే సమ్మె విరమించి పీ హెచ్ సీ వైద్యులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి
అమరావతి, 18 అక్టోబర్ (హి.స.),ప్రజారోగ్యం దృష్ట్యా వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని పీహెచ్‌సీ వైద్యులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం రాత్రి పీహెచ్‌సీ వైద్యుల సంఘం నేతలతో ఆయన చ
ప్రజారోగ్య దృశ్య వెంటనే సమ్మె విరమించి పీ హెచ్ సీ వైద్యులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి


అమరావతి, 18 అక్టోబర్ (హి.స.),ప్రజారోగ్యం దృష్ట్యా వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని పీహెచ్‌సీ వైద్యులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం రాత్రి పీహెచ్‌సీ వైద్యుల సంఘం నేతలతో ఆయన చర్చించారు. సౌరభ్‌ గౌర్‌ మాట్లాడుతూ పీజీ మెడికల్‌ ఇన్‌-సర్వీసు కోటాలో ఈ ఏడాదికి 20శాతం సీట్లను అన్ని స్పెషాలిటీ కోర్సుల్లో కలిపి కేటాయిస్తామని గతంలో ఇచ్చిన హామీపై జీవో విడుదలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వైద్యుల ట్రైబల్‌ అలవెన్సు, నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టంచేశారు.

అయితే.. 2026-27 నుంచి కనీసం మూడేళ్ల పాటు 15 శాతం సీట్లను పీజీ ఇన్‌-సర్వీసు కోటా అన్ని స్పెషాలిటీ కోర్సుల్లో కేటాయించాలని సంఘం నేతలు కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ నవంబరులోగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంటుందని చెప్పారు. పాలసీ రూపకల్పనలో సంఘం ప్రతినిధులకు కూడా భాగస్వామ్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande