హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) రిజర్వేషన్లలో తమ వాటా కోసం
బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ (BC JAC Bandh) రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారు జామునుంచే అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. డిపోల నుంచి బస్సులు (RTC buses) బయటకు రాకుండా ఎక్కడికక్కడ నేతలు అడ్డుకున్నారు. బంద్ కారణంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బస్సు చక్రం కదలలేదు. అన్ని బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు(Private cabs), ఆటో డ్రైవర్లు ప్రయాణికులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..