బీసీ బంద్ ఉద్రిక్తం.. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట
మహబూబాబాద్, 18 అక్టోబర్ (హి.స.) బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇచ్చిన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బందుకు తొర్రూరులో విశేష స్పందన లభించింది. పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు, షాపులు, బస్సు డిపోలు స్వచ్ఛందంగా మూతపడ
బీసీ బంద్


మహబూబాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇచ్చిన

కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బందుకు తొర్రూరులో విశేష స్పందన లభించింది. పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు, షాపులు, బస్సు డిపోలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రభుత్వం ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు నిలిచిపోవడంతో నిరాశకు గురైన బీసీలు బందుకు పిలుపునివ్వగా అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు అయిన బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ, ఎస్ఎఫ్ఎ పలు సంఘాల నాయకులు ఈ బంద్కు వేరువేరుగా మద్దతు తెలుపుతూ ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించాయి.

ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ వ్యాపార సంస్థలను మూసి వేయాలని కోరారు. అయితే బస్టాండ్ సెంటర్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల బైక్ ర్యాలీలు ఒకేసారి ఎదురెదురుగా రావడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వారి మధ్య మాటామాటా పెరగడంతో తోపులాటకు దారితీసింది. ఒక దశలో ఇరు వర్గాల నాయకులు ఒక పార్టీ పై ఇంకో పార్టీ వారు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వలన అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande