మంథనిలో ప్రశాంతంగా బీసీ బంద్.. అన్ని వ్యాపార సంస్థలు మూసివేత..
తెలంగాణ, 18 అక్టోబర్ (హి.స.) పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఉదయం నుండి బీసి బంద్ ప్రశాంతంగా కొనసాగింది. మంథని ఆర్టీసీ బస్సు డిపోలో బస్సులు నిలిచిపోవడంతో బస్టాండ్లో రద్దీ లేకుండా కనిపించింది. బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో రోజువారీ ప్రయాణిక
మంథని బంద్


తెలంగాణ, 18 అక్టోబర్ (హి.స.)

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఉదయం నుండి బీసి బంద్ ప్రశాంతంగా కొనసాగింది. మంథని ఆర్టీసీ బస్సు డిపోలో బస్సులు నిలిచిపోవడంతో బస్టాండ్లో రద్దీ లేకుండా కనిపించింది. బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో రోజువారీ ప్రయాణికుల సందడి లేక వెలవెల పోయింది.

బందు కారణంగా గంటల తరబడి వేచి ఉన్నా కొందరు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరడానికి ఇబ్బంది పడ్డారు. అత్యవసరంగా ఆటోల్లో ఇతర ప్రైవేటు వాహనాల్లో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణం కొనసాగించారు. పెట్రోల్ బంక్లు, హోటళ్లు అన్ని ఇతర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఈ బంద్ లో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు పాల్గొన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande