వనపర్తి, 18 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ల బంద్ కు రోడ్డెక్కాయి. ఈ బంద్ లో జెండాల వివాదం కాస్త ఇరు పార్టీల మధ్య ఘర్షణలకు దారితీసింది. బంద్ లో మా వైఖరి కరెక్ట్ అంటే కాదు, కాదు మా వైఖరే కరెక్ట్ అంటూ బీ ఆర్ ఎస్, సీపీఎం, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు ఘర్షణకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వనపర్తి జిల్లా అమరచింత మండలం కేంద్రంలో ప్రధాన రహదారిపై బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం వామపక్ష పార్టీలు బంద్ లో భాగంగా రోడ్డుపై బైఠాయించారు. బీఆర్ఎస్ జెండాలు ఎక్కువగా ఉన్నాయని, మా జెండాలు కనపడడం లేదని, వాటిని తొలగించాలని, వామపక్ష, కాంగ్రెస్ నాయకులు వాదనకు దిగారు.
జెండాలను తొలగించే ప్రసక్తే లేదని బీఆర్ ఎస్ నాయకులు వాదించడంతో ఇరు వర్గాల నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన సీపీఎం పార్టీ నాయకులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కి బీఆర్ఎస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ, మరోపక్క బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపడం వెనుక కుట్ర మాకు తెలుసని, సీపీఎం నాయకులు విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు