రంగారెడ్డి, 18 అక్టోబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బీసీ బంద్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బెంగుళూరు హైదరాబాద్ రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిరసనలో పాల్గొన్నారు. భారీగా కాంగ్రెస్ కార్యర్తలు, నాయకులు నిరసనలో పాల్గొనగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు