సీనియర్లతో విభేదాలు అంటూ పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) టీమిండియా 50 ఓవర్ల సమరానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటకే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఎట్టకేలకు గ్రౌండ్లో గ్రాండ్గా అడుగుపెట్టనున్నారు. రేపటి నుంచి భారత జట్టు ఆస్ట్రేలియాతో మ
కెప్టెన్ శుభ్మన్ గిల్


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

టీమిండియా 50 ఓవర్ల సమరానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటకే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఎట్టకేలకు గ్రౌండ్లో గ్రాండ్గా అడుగుపెట్టనున్నారు. రేపటి నుంచి భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేలకు మ్యాచ్లకు కెప్టెన్గా నియమితుడైన విషయం తెలిసిందే. అయితే, రోహిత్ను సారథిగా తప్పించిన నేపథ్యంలో అతడితో గిల్కు విబేధాలు తలెత్తాయంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతోంది. ఈ క్రమంలోనే వస్తున్న వార్తలన్నింటికీ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇవాళ క్లారిటీ ఇచ్చాడు. బయట తమపై భిన్నంగా కథనాలు వస్తున్నాయని అన్నారు. కానీ, అలాంటి ఏవీ తమ మధ్య లేవని తెలిపారు. వాళ్లు జట్టులో ఉండటం తనకు కలిసి వస్తుందని పేర్కొన్నారు. అనుభవాలు, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో వారితో మాట్లాడి చేర్చుకుంటానని అన్నారు. జట్టులో అందరి ఆలోచనలు తీసుకోవడం తనకు ఇష్టమని.. ఆటపైనే ఫోకస్ పెడతానని శుభ్మన్ గిల్ స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande