పుట్టపర్తి, 18 అక్టోబర్ (హి.స.)
సత్యసాయి జిల్లా పరిధిలో వేర్వేరు చోట్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
సత్యసాయి జిల్లాలోని ఆరు మండలాల్లో తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 12 లక్షలు విలువైన 100 గ్రాముల బంగారం, ఒక కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లోని 5 దేవాలయాల్లో దొంగతనాలు చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.16 లక్షలు, రూ.2,16,500 విలువైన అమ్మవారి వెండి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 9 మండలాల్లో విద్యుత్ నియంత్రికలను ధ్వంసం చేసి రాగి తీగలను అమ్ముకుంటున్న దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువైన 657 కేజీల రాగి తీగను స్వాధీనం చేసుకునట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ