అమరావతి, 19 అక్టోబర్ (హి.స.)
రాజమహేంద్రవరం-): అన్నదాత) పంట పండింది.. ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏటా సాధారణంగా 2.5 మెట్రిక్ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ సేకరించేవారు. దీంతో చివరిలో రైతులు ఇబ్బంది పడేవారు.గత రబీ సీజన్‌లో చివరి రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా రబీలో ధాన్యం మంచి ధరకు కొనుగోలు చేయడంతో పాటు 24 గంటల్లో నగదు రైతు ఖాతాల్లో జమ చేయడంతో అందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన సంగతి తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ