ఒంగోలు, 19 అక్టోబర్ (హి.స.)
దీపావళి()పండుగ అంటే బాణసంచాకాల్చడం పరిపాటి. బాణసంచా తయారీకి తమిళనాడు రాష్ట్రంలో శివకాశి పెట్టిందిపేరు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా శివకాశి నుంచి బాణసంచా తీసుకొచ్చి విక్రయాలు చేస్తుంటారు. అందుకు సంబంధించి హోల్‌సేల్ వ్యాపారులు అటు ప్రజల జేబులకు చిల్లు పెటడంతోపాటుగా, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. జిల్లాలో 14 మంది హోల్‌సేల్ వ్యాపారులు ఉండగా ఒంగోలు(Ongole)లో ఉన్న ఓ వ్యాపారి ఇతర రాష్ట్రాలకు కూడా బాణసంచా సరఫరా చేసి సొమ్ము చేసుకుంటారు. అయితే దీపావళి పండుగ ఒక్కరోజు అయినా జిల్లాలో సుమారుగా రూ. 20 కోట్లకు పైగా బాణసంచా విక్రయాలు జరిగే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ