హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) అమెరికా కు చెందిన రాజకీయ నేత చాండ్లర్ లాంగేవిన్ (chandler lagaein) భారతీయులకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. అమెరికాలోని ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ ఆయన సోషల్ మీడియా లో పోస్టులు పెట్టాడు. ఆ పోస్టులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో పామ్ బే నగర కౌన్సిల్ ఆయనపై చర్యలు తీసుకుంది.
చాండ్లర్ లాంగేవిన్ ఫ్లోరిడాలోని పామ్ బే సిటీ కౌన్సిల్కు చెందిన యూఎస్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు. ఆయన భారతీయులను ఉద్దేశిస్తూ పెట్టిన విద్వేషపూరిత పోస్టులపై అక్కడి భారతీయ అమెరికన్ గ్రూపులతో పాటు కాంగ్రెస్ సభ్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. గత నెల నుంచి లాంగేవిన్ భారతీయులకు వ్యతిరేకంగా వరుస పోస్టులు పెడుతూ వచ్చాడు. ఓ భారతీయ ట్రక్ డ్రైవర్ చేసిన ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందనే వార్తను లాంగేవిన్ షేర్ చేశాడు.
అందుకు 'అమెరికాలోని భారతీయులందరినీ వెంటనే బహిష్కరించాలి' అని తన సోషల్ మీడియా పోస్టు ద్వారా డిమాండ్ చేశాడు. 'అమెరికా గురించి పట్టించుకునేందుకు ఒక్క భారతీయుడు కూడా లేడు. వారు మనల్ని ఆర్థికంగా దోపిడి చేస్తున్నారు. వారు భారత్ను, ఆ దేశ ప్రజలను ప్రోత్సహించేందుకే ఇక్కడ ఉన్నారు. కానీ అమెరికన్ల కోసం మాత్రమే ఈ దేశం' అని మరో పోస్టు పెట్టారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..