మంత్రి కుమార్తె ఏకంగా సీఎంపైనే ఆరోపణలు చేస్తే వివరణ ఎందుకు ఇవ్వలేదు?: సబితా ఇంద్రా రెడ్డి
హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) సిట్టింగ్ మంత్రి కూతురు ఏకంగా సీఎం పై ఆరోపణలు చేస్తే ఎందుకు వివరణ ఇవ్వలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి తెలంగాణ భవన్లో ఆదివారం సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.
సబితా ఇంద్రారెడ్డి


హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)

సిట్టింగ్ మంత్రి కూతురు ఏకంగా సీఎం పై ఆరోపణలు చేస్తే ఎందుకు వివరణ ఇవ్వలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి తెలంగాణ భవన్లో ఆదివారం సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడే ఈ సెటిల్మెంట్లో కూర్చున్నాడంటే కచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇందులో హస్తం ఉంటుందని చెప్పారు. ఏ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ను బెదిరించారో అతని స్టేట్మెంట్ పోలీసులు తీసుకున్నారా, ఒక వేళ తీసుకుంటే అది ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. నిందితుడు మంత్రి కొండా సురేఖ ఇంట్లో ఎందుకు ఉన్నాడని, అతని ఎందుకు ఆశ్రయం ఇవ్వడం సరైనదేనా అని ప్రశ్నించారు. నిందితుడిని మంత్రి తన కారులో తీసుకెళ్తే పోలీసులు చర్యలు తీసుకోరా అన్నారు. ఈ అంశంలో అసలేం జరిగింది, ఎక్కడ సెటిల్మెంట్ జరిగిందన్నారు. టేబుల్పై గన్ పెట్టి బెదిరించారని, ముఖ్యమంత్రే స్వయంగా తుపాకీ ఇచ్చారని చెబుతున్నారని, ఈ గన్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందని, ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande