పార్వతీపురం, 19 అక్టోబర్ (హి.స.)
:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా )లో ఇవాళ(ఆదివారం) భారీ పేలుడు( సంభవించింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు నుంచి ఏఎన్ఎల్ పార్సిల్‌కి వచ్చిన సామన్లు దించుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా... మరో ఇద్దరికి స్పల్ప గాయాలయ్యాయి.
క్షతగ్రాతులని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఇరువురిని విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు, సామగ్రి మెుత్తం ధ్వంసమయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ