మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి.. బండి సంజయ్ వార్నింగ్
హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) ప్రజాస్వామ్యం పేరుతో సాయుధ దళాల నెట్వర్క్ కు (Armed network) మద్దతు ఇస్తున్నవారు వెంటనే సంబంధాలు తెంచుకోవాలని అలాంటి వారు బహిర్గతం కాక తప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Band Sanjay) హెచ్చరించారు. ఒక మావో
బండి సంజయ్


హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)

ప్రజాస్వామ్యం పేరుతో సాయుధ దళాల నెట్వర్క్ కు (Armed network) మద్దతు ఇస్తున్నవారు వెంటనే సంబంధాలు తెంచుకోవాలని అలాంటి వారు బహిర్గతం కాక తప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Band Sanjay) హెచ్చరించారు. ఒక మావోయిస్టు (Maoist) వర్గం తెలంగాణ రాజకీయ నేతలతో కుమ్మక్కు అయిందని ఇటీవల సరెండర్ అయిన మల్లోజుల తెలిపినట్లు ఓ జాతీయ దినపత్రికలో వచ్చిన కథనాన్ని, అలాగే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కర్రెగుట్టల నుంచి తెలంగాణ వైపు వెళ్లాడని ఆయన అనుచరుడు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఉన్న వార్త కథనాన్ని ఇవాళ బండి సంజయ్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఏజెన్సీలు మావోయిస్టు కార్యకర్తల వద్దే ఆగిపోవని, ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్రం.. అవినీతి, నేరాలు, తీవ్రవాద సంబంధాలను కాపాడుతున్న వారిని వెంటాడుతుందన్నారు. అలాంటి వారి పట్ల ఎలాంటి కనికరం, ఉదాసీనత లేకుండా నిర్మూలిస్తుందన్నారు. మీరు ఎవరైనా ఎంతటి పెద్దవారని భావించినా అలాంటి నెట్ వర్క్ ల నుంచి పక్కకు తప్పుకోవాలని సూచించారు. దేశ అంతర్గత భద్రతకు విఘాతంగా నిలిస్తే మీరు ఎంత పెద్ద నాయకులైనా కూలిపోవాల్సిందే అన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు దీన్ని హెచ్చరికగా భావించాలంటూ ట్వీట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande