చంద్రుడి వాతావరణంపై సూర్యుడి ప్రభావం..! ఇస్రోకు కీలక సమాచారం పంపిన చంద్రయాన్-2..!
హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్-2.. తాజాగా మరో కొత్త సమాచారాన్ని పంపింది. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని గురించింది. ఈ విషయాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. చంద్రుని ఎక్సోస
చంద్రయాన్


హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్-2.. తాజాగా మరో కొత్త సమాచారాన్ని పంపింది. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని గురించింది. ఈ విషయాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. చంద్రుని ఎక్సోస్పియర్, వాతావరణం, ఉపరితలంపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ఈ సమాచారం సహాయపడుతుందని ఇస్రో పేర్కొంది. ఇస్రోకు చెందిన చంద్రయాన్-2 లూనార్ ఆర్బిటర్ అంతరిక్ష శాస్త్ర రంగంలో తొలిసారిగా ఈ సమాచారాన్ని సేకరించినట్లుగా వెల్లడించింది. చంద్రయాన్-2 లోని సాంకేతిక పరికరం అయిన ఛేస్-2 (CHACE-2) సూర్యుడి నుంచి వెలువడే కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) చంద్రుడి ఎక్సోస్పియర్పై ప్రభావాన్ని పరిశీలించింది.

ఈ భారీ సౌర తుఫాను చంద్రుడిని తాకిన సమయంలో చంద్రుని పగటిపూట ఎక్సోస్పియర్లో మొత్తం పీడనం అకస్మాత్తుగా పెరిగిందని చంద్రయాన్-2 డేటా తెలిపింది. వాతావరణంలోని అణువులు, వాటి సాంద్రత పది రెట్లు ఎక్కువ పెరిగిందని ఛేస్-2 నమోదు చేసిందని ఇస్రో పేర్కొంది. ఈ సంఘటన 10 మే 2024న జరిగింది. ఈ సమయంలో సూర్యుడి కరోనల్ మాస్ ఎజెక్షన్ల ప్రభావం చంద్రుడిపై పడినట్లుగా ఇస్రో పేర్కొంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande