హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)
'మహిళలకు రూ.2500 ఇవ్వండి సీఎం గారు.. అదొక్కటి చేస్తే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లే' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. ఆదివారం చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరైన సందర్భంగ వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు.మహిళలు కూడా అడుగుతున్నారని, జర అదొక్కటి చేయండి అని విజ్ఞప్తి చేశారు. సన్న బియ్యం ఇస్తా అని చెప్పలేదు కానీ ఇస్తున్నామన్నారు. దేశంలో కులగణన చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే అని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కోట్లడదాం అని వీహెచ్ చెప్పుకొచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు