హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించింది. ఊహించిన విధంగానే మ్యాచ్ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ను నిలిపివేశారు. వర్షం కారణంగా మ్యాచ్ను 35 ఓవర్లకు కుదించారు. ఒక్కో బౌలర్కు ఏడు ఓవర్లు వేయనున్నారు. ఇదిలా ఉండగా.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మిచెల్ మార్ష్ నిర్ణయానికి తగినట్లుగా ఆసిస్ బౌలర్లు చెలరేగారు. దాంతో టీమిండియా బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. కంగారుల బౌలింగ్ ధాటికి టీమిండియా ఎనిమిది ఓవర్లలో కీలక మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0), యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ (10) పరుగులకు పెవిలియన్కు చేరడంతో టీమిండియా చిక్కుల్లో పడింది. తొలుత జోష్ హేజిల్వుడ్ వేసిన బంతిని షాట్ ఆడబోయి స్లిప్లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు