రాష్ట్ర ప్రభుత్వం.ఉద్యోగులకు దీపావళి. కానుక
అమరావతి, 19 అక్టోబర్ (హి.స.)రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు ఒక విడత డీఏ (కరువు భత్యం) విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నవంబరు నుంచి ఉద్యోగుల ఖాతాల్లో డీఏ సొమ్ము జమ అవుతుందని తెలిపా
రాష్ట్ర ప్రభుత్వం.ఉద్యోగులకు దీపావళి. కానుక


అమరావతి, 19 అక్టోబర్ (హి.స.)రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు ఒక విడత డీఏ (కరువు భత్యం) విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నవంబరు నుంచి ఉద్యోగుల ఖాతాల్లో డీఏ సొమ్ము జమ అవుతుందని తెలిపారు. దీనికిగాను నెలవారీగా రూ.160 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివారం మంత్రివర్గ ఉప సంఘ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత రాత్రి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో భేటీ అయ్యారు. ఒక విడత డీఏతో సహా అనేక నిర్ణయాలను స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పోలీసులకు ఒక విడత ఈఎల్స్‌(ఆర్జిత సెలవులు) ఇస్తామని, దీన్ని రెండుసార్లుగా నవంబరులో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105 కోట్లు చెల్లిస్తామని సీఎం చెప్పారు. ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న హెల్త్‌కార్డు సేవలను 60 రోజుల్లో వారి అవసరాలకు తగినట్టుగా మెరుగుపరుస్తామని తెలిపారు. అలాగే, 180 రోజుల చిన్నారుల సంక్షరణ సెలవుల(చైల్డ్‌కేర్‌ లీవు)ను వారు రిటైర్‌ అయ్యేలోగా ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande