హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మాగంటి
గోపీనాథ్ భార్య సునిత ఇప్పటికే మూడు సెట్ల నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే.
ముందస్తు జాగ్రత్త లో భాగంగా అప్రమత్తమైన బీఆర్ఎస్ పార్టీ.. జూబ్లీహిల్స్ బై పోల్ అభ్యర్థిగా పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి తో కూడా మరో నామినేషన్ దాఖలు చేయించింది. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మాగంటి సునీత నామినేషన్లో ఎమైన తప్పులు ఉండి.. ఆమె నామినేషన్లు తిరస్కరణకు గురైతే.. బీఆర్ఎస్ అల్టర్నేట్ అభ్యర్థిగా విష్ణు వర్థన్ పోటీలో నిలిచే అవకావం ఉంటుంది. లేదా ఆమె నామినేషన్ సరిగ్గా ఉంటే.. ఉపసంహరణ తేదీలోపు.. విష్ణు వర్థన్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..