బాబోయ్‌.. ముంచుకొస్తున్న మరో అల్పపీడనం..! ఆ జిల్లాలకు భారీ వర్షాలు
అమరావతి, 19 అక్టోబర్ (హి.స.) ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, దక్షిణ మధ్య… పశ్చిమమధ్య బంగాళాఖాతంలో
బాబోయ్‌.. ముంచుకొస్తున్న మరో అల్పపీడనం..! ఆ జిల్లాలకు భారీ వర్షాలు


అమరావతి, 19 అక్టోబర్ (హి.స.) ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, దక్షిణ మధ్య… పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం అక్టోబర్ 21 మధ్యాహ్నం నుండి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాతావరణం పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అంబేద్కర్ కోసం జిల్లా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. సముద్రంలో ఉన్నవారు 21వ తేదీ లోపు తీరానికి రావాలని, వాతావరణ మార్పులు గమనించి జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మత్స్యశాఖ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande