'K-Ramp', డ్యూడ్ సినిమాలకు షాకింగ్ కలెక్షన్స్,
హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) దీపావళి కానుకగా రిలీజ్ అయిన డ్యూడ్ ( Dude), కె -ర్యాంప్ ( K Ramp) సినిమాలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే సినిమా కలెక్షన్స్ కూడా వస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
సినిమా కలెక్షన్స్


హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)

దీపావళి కానుకగా రిలీజ్ అయిన

డ్యూడ్ ( Dude), కె -ర్యాంప్ ( K Ramp) సినిమాలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే సినిమా కలెక్షన్స్ కూడా వస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు కాంబినేషన్ లో వచ్చిన డ్యూడ్ సినిమా కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. రెండు రోజుల కిందట రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడినట్లు అధికారికంగా మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది.

తొలిరోజు 22 కోట్లు రాబట్టిన ఈ సినిమా, రెండో రోజు 23 కోట్లు తీసుకువచ్చింది. దీపావళి హాలిడేస్ మరో రెండు రోజులు ఉన్న నేపథ్యంలో... 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అటు కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా కాంబినేషన్ లో వచ్చిన సినిమా కె-ర్యాంప్. ఈ సినిమాను జైన్స్ నాని చాలా గ్రాండ్ గా తీశారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా రూ.2.15 కోట్లు వసూలు చేసిందట. తెలుగు రాష్ట్రాలలో 37.10 ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande