దళారులను నమ్మి మోసపోవద్దు.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి , 19 అక్టోబర్ (హి.స.) రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కోరారు. ఆదివారం వారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కేంద్రంలోని గోదాం వద్ద ప
విప్ బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి , 19 అక్టోబర్ (హి.స.)

రైతులు దళారులను నమ్మి

మోసపోవద్దని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కోరారు. ఆదివారం వారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కేంద్రంలోని గోదాం వద్ద పీఎసీఎస్ రేణిగుంట ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి, ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని రైతులను కోరారు. ఆయన వెంట పార్టీ నేతలు ఉన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని డబ్బులు వెంటనే పడేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్వాహకులు రైతులకు సహకరించాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande