విజయవాడ, 19 అక్టోబర్ (హి.స.)విజయవాడలో అర్దరాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో బస్టాండ్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఓ బస్సు వరదలో చిక్కుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను జాగ్రత్తగా బయటకు దింపారు. తరవాత వారిని అక్కడ నుండి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. విజయవాడ సిటీతో పాటు క్రిష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గుడివాడ బెల్టులో 70mm నుండి 100mm రికార్డు స్థాయి వర్షాపాతం నమోదైంది. అంతే కాకుండా కాకినాడ జిల్లా పెద్దాపురంలోనూ 146mmతో భారీ వర్షాపాతం నమోదైంది. విజయనగరం, శ్రీకాకుళంలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV