ప్రధాని మోడీ కర్నూల్ పర్యటనలో భద్రతా లోపం.. ఆలస్యంగా వెలుగులోకి
కర్నూల్, 19 అక్టోబర్ (హి.స.)భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పర్యటనలో భాగంగా శ్రీశైలం మహా క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కర్నూల్ పట్టణ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని పాల్గ
ప్రధాని మోడీ కర్నూల్ పర్యటనలో భద్రతా లోపం.. ఆలస్యంగా వెలుగులోకి


కర్నూల్, 19 అక్టోబర్ (హి.స.)భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పర్యటనలో భాగంగా శ్రీశైలం మహా క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కర్నూల్ పట్టణ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా లోపం చోటు చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీశైలంలోని సున్నిపెంట హెలిపాడ్‌లో ప్రధాని మోడీకి వీడ్కోలు పలికే సమయంలో పాస్‌ల జాబితాలో లేని వ్యక్తులు ప్రవేశించినట్లు గుర్తించారు.

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజిన్ ఇతరుల పేరులతో ఉన్న పాస్‌లతో ఇద్దరు వ్యక్తులు ప్రధాని వలయంలోకి వచ్చారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇద్దరు వేరే వారి పాస్‌లు దక్కించుకుని వాటిని టాంపరింగ్ చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రధాని మోడీ భద్రత లోపంపై బీజేపీ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. మరి పోలీసులు ఈ వ్యవహారం పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande