భద్రాద్రి వద్ద శాంతించిన గోదావరి.. ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ
తెలంగాణ, భద్రాచలం. 2 అక్టోబర్ (హి.స.) భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం అధికారులు ప్రమాద హెచ్చరికలు పట్టడంతో ఉపసంహరించారు. బుధవారం ఉదయం 7.27 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించగా, గురువారం అర్ధరాత్రి గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడ
గోదావరి


తెలంగాణ, భద్రాచలం. 2 అక్టోబర్ (హి.స.)

భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం అధికారులు ప్రమాద హెచ్చరికలు పట్టడంతో ఉపసంహరించారు. బుధవారం ఉదయం 7.27 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించగా, గురువారం అర్ధరాత్రి గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు తగ్గి 42.90 అడుగుల మేర ప్రవహించడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించారు. 9,27,580 క్యూసెక్కుల నీరు దిగువకు తరలి వెళ్తుంది. కాగా తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకు వరద నీరు తగ్గింది. రహదారులపై గోదావరి నీరు తగ్గడంతో రాకపోకలకు ఆటంకం తొలిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande